వైద్యుల ప్రకారం..ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల్లో రాగులు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో బి1, బి2, బి6, కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫొలేట్, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.