
చిన్న కరివేపాకుతో పెద్ద ఫలితాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసే కరివేపాకు ఆకులను జ్యూస్‌గా చేసుకుని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఉదయాన్నే కరివేపాకు రసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది బరువు తగ్గటం.

ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల డైజెషన్ మెరుగవుతుంది. బరువు పెరగడానికి ముఖ్య కారణాల్లో ఒకటి జీర్ణ సమస్యలు, మలబద్ధకం. కరివేపాకు జ్యూస్‌ని తీసుకోవడం వల్ల ఈ రెండూ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఇందుకోసం 10 కరివేపాకులు, గోరువెచ్చని నీరు తీసుకోవాలి. ముందుగా కరివేపాకుని గ్రైండ్ చేసి, గోరువెచ్చటి నీటిలో వేసి.. ఉదయాన్నే తాగాలి. ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు..టాక్సిన్స్ బయటకు పోతాయి. అంతేకాదు ఈ జ్యూస్.. జుట్టు, చర్మానికి కూడా మంచిది.

వ్యాధినిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుందిది. నాడీసంబంధిత వ్యాధుల్నీ, క్యాన్సర్లనీ అడ్డుకుంటుంది. కరివేపాకు వాసన పీల్చితే ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయట. ఇంకా జ్ఞాపకశక్తిని పెంచే కరివేపాకు అల్జీమర్స్ లాంటి వ్యాధుల్నీ దరిచేరనివ్వదట.

curry-leaves