
లవంగాల పొడి కలిపిన పాలలో కార్మినేటివ్, స్టిమ్యులెంట్ పదార్థాలు ఉంటాయి. ఇవి బీపిని అదుపులో ఉంచుతాయి. అలసటగా ఉన్నప్పుడు ఓ కప్పు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి.

మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు లవంగం పాలు అమృత సమాన ఔషదం. లవంగం పాలలో ఉండే సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

లవంగాలలో ఉండే కాల్షియం పంటి నొప్పి, నోటి దుర్వాసన, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం పొడి కలిపిన పాలు తాగితే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. పొట్టను శుభ్రపరచడంలో లవంగాలు సాయపడతాయి. ముఖ్యంగా లవంగం పాలు పురుషుల్లో సంతానోత్పత్తికి స్టామినా బూస్టర్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

లవంగం పాలు తాగటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పాలు తాగటం వల్ల పెద్దపేగును శుద్దిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. లవంగం పాలు తాగితే దంతాలు, ఎముకలు బలపడతాయి. పంటి నొప్పి, నోటి దుర్వాసన, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన మొదలైన సమస్యల నుంచి దూరం చేస్తుంది.

లవంగం పాలు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి. అందుకే బీపీ రోగులు లవంగాల పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు. లవంగాల పాలు తాగితే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. పొట్టను శుభ్రపరచడంలో లవంగాలు సాయపడతాయి. లవంగం పొడిని పాలలో కలిపి తాగితే జీవ క్రియ వేగవంతం అవుతుంది.