
బొటన వేలు , చేతుల క్రాస్ చేసే పద్ధతి, మీరు నిద్రపోయే భంగిమ, కూర్చోనే శైలి, మీ జుట్టు రకం, పాదాల ఆకారం ఇవన్నీ కూడా మీ వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేస్తాయి. అదే విధంగా మీరు మీ హ్యాండ్ బ్యాగ్ వేసుకునే విధానం కూడా మీ ప్రవర్తన, వ్యక్తిత్వం తెలియజేస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఒకొక్కరూ ఒక్కో విధంగా బ్యాగ్ వేసుకుంటారు. కొంత మంది స్టైల్‌గా బ్యాగ్ వేసుకుంటే, కొంత మంది నార్మల్‌గా వేసుకుంటారు. అయితే మీరు బ్యాగు వేసుకునే విధానం కూడా మీ వ్యక్తిత్వాన్ని రివీల్ చేస్తుందంట. మీ వస్తువులను భద్రపరిచే బ్యాగ్ మీ క్యారెక్టర్ చెప్పేస్తుందంట. కాగా, మీరు మోచేతిపై లేదా భుజం పై లేదా చేతిలో గట్టిగా పట్టుకొని, ఎలా మీరు మీ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తున్నారో తెలుసుకొని, దాని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోండి.

మోచేతిపై బ్యాగ్ మోయడం : మీరు మీ మోచేతిపై బ్యాగ్ మోయడం అనేది మీలోని శక్తిని తెలియజేస్తుంది. ఇలాంటి వ్యక్తులు చాలా ఆత్మవిశాసం ఉన్న వారు. తమ కెరీర్ పై వీరికి పూర్తి అవగాన ఉంటుంది. ఇలాంటి వారు చాలా స్వతంత్రంగా ఉండాలి అనుకుంటారు. మీ విలువ మీకే తెలుసు, మీరు గౌరవాన్ని ఆశిస్తున్నారని ఈ విధానం తెలుపుతుంది. అంతే కాకుండా ఒకరకమైన రాజసం తెలియజేస్తుంది. ఇలాంటి వ్యక్తులు చాలా గొప్పగా ఆలోచిస్తారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అన్నింటిపై అవగాహన ఉన్నా కూడా చాలా నిమ్మలంగా ఉండే వ్యక్తులు. అవసరం అయితే తప్ప మాట్లాడటానికి ఇష్టపడరు.

బ్యాగ్ భుజాలపై వేసుకోవడం : ఇలాంటి వారు చాలా ఉత్సాహవంతులు. వీరు అందరితో చాలా కలివిడిగా ఉంటారు. అంతే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. చాలా స్నేహంగా ఉంటారు. కానీ కొన్ని సార్లు వీరి వ్యవహార శైలి ప్రతి ఒక్కరికీ సమస్యలు తీసుకొస్తాయి. ఏ పని అప్పజెప్పినా చాలా త్వరగా ఆత్మవిశ్వాసంతో చేస్తారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎంత పరిస్థితి అయినా సరే మీరే స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి ఇంట్రస్ట్ చూపుతారు. అంతే కాకుండా చాలా త్వరగా ఆ సమస్యను పరిస్కరిస్తారు. మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటారు.

ఒక చేతితో బ్యాగ్ పట్టుకోవడం : ఒక చేతితో బ్యాగ్ పట్టుకునే వారు చాలా వినయం కలవారు. వీరు చాలా సౌమ్యులు, స్వతంత్రంగా ఉండాలి అనుకుంటారు. అంతే కాకుండా వీరు వీరి రహస్యాలను ఇతరులతో పంచుకోరు. ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వీరి ఆశయం చాలా గొప్పగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలి అనుకుంటారు.