అప్పట్లో ఫుల్ డిమాండ్ ఉన్న పెసరపప్పు పచ్చడి.. శరీరానికి చలువ,పొట్టకి హాయిగా ఉంటుంది

Updated on: Jun 20, 2026 | 7:49 PM

పెసరపప్పు పచ్చడిని పాత రోజుల్లో ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. ఇంకా దీనిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.అలాగే, తేలికగా జీర్ణమవ్వడం వల్ల పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. అలాగే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

1 / 5
పెసరపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు,  నాలుగు ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న  చిన్న నిమ్మకాయంత  చింతపండు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె,  అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,  నాలుగు కరివేపాకు ఆకులు, నాలుగు ఎండుమిర్చిని తీసుకోవాలి.

2 / 5

పెసరపప్పు పచ్చడి తయారి విధానం : మీరు ముందుగా పెసరపప్పును తీసుకుని నూనె చుక్క కూడా లేకుండా మీడియం మంటపై గోల్డ్ కలర్లోకి వచ్చే  వరకు వేయించాలి. అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా నాలుగు వెల్లుల్లిని వేయించి దీనిని బాగా చల్లారనివ్వాలి. పాత కాలంలో వీటినే బాగా తినే వాళ్ళు.

3 / 5

పెసరపప్పు పచ్చడి తయారి విధానం స్టెప్ 1: చింతపండును తీసుకుని కనీసం 10 నిమిషాలు పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఇంకా ఈ మిక్సీ జార్‌లో ముందుగా వేయించిన పెసరపప్పు, నాలుగు ఎండుమిర్చి, నాలుగు వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఉప్పు కూడా వేసి  నీరు కూడా పోసి దీనిని పచ్చడిలా రుబ్బుకోవాలి.

4 / 5

ఇక ఇప్పుడు మళ్ళీ  చిన్న పాన్‌ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయ్యాక దానిలో కొద్దిగా ఆవాలు, ఇంకా కొంచం మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇక చివర్లో ఈ తాలింపును పచ్చడి మీద  పోసి వీటిని మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. అంతే, వేడి వేడి పెసరపప్పు రెడీ. వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.

5 / 5

పెసరపప్పు పచ్చడి వలన లాభాలు ఇవే:  పెసరపప్పు పచ్చడిని పాత రోజుల్లో ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. ఇంకా దీనిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.అలాగే, తేలికగా జీర్ణమవ్వడం వల్ల పొట్టకు కూడా  హాయిగా ఉంటుంది. అలాగే, దీనిలో ఫైబర్  ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

Follow Us