
పల్లీల రైస్ కు కావలసిన పదార్థాలు : నాలుగు కప్పుల ఉడికించిన అన్నం, ఒక కప్పు పల్లీలు, నాలుగు ఎండుమిర్చి , రెండు పచ్చిమిర్చి , వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, కరివేపాకు, పసుపు , ఉప్పు , నూనెను , కొత్తిమీరను తీసుకోవాలి.

పల్లీల రైస్ తయారీ విధానం: ముందుగా పాన్‌లో పల్లీలు నార్మల్ గా వేయించుకోవాలి. ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మంటపై వాటిని కరకరలాడే వరకు బాగా వేయించాలి. ఇంకా చల్లారిన తర్వాత ఈ పల్లీల పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం పల్లీలు విడిగా ఉంచి, మిగతావి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి.

పల్లి పొడిని ఇలా తయారు చేయాలి: అయితే, మిక్సీ జార్ తీసుకుని దీనిలో వేయించిన పల్లీలు, నాలుగు ఎండుమిర్చి, ఇంకా నాలుగు వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు కూడా వేసి కొంచెం పొడిలాగా చేసుకోవాలి. అయి, ఇది పూర్తిగా మెత్తగా కాకుండా టేస్టీగా ఉంటుంది. ఇంకా పాన్ లో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించాలి.

ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఆకులు కూడా వేసి వేయించాలి. ఇంకా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసి వెంటనే కలపాలి. అప్పుడు ఈ అన్నానికి మంచి రంగు, ఫ్లేవర్ ఇస్తుంది. ఇక చివర్లో ముందుగా ఉడికించి అన్నం వేసి కొద్దీ కొద్దిగా దీనిని కలుపుతూ ఉండాలి ఇవి ముద్దలాగా కాకుండా తిప్పుకోవాలి.

ఇక ఇప్పుడు దీనిలో తయారుచేసుకున్న పల్లి పొడిని కూడా ఈ అన్నంలో వేసి బాగా మంచిగా కలపాలి. ఉప్పు వేసి టెస్ట్ లేకపోతే ఇంకా . మీడియం మంటపై 5 నిమిషాలు ఉంచి దీనిని కలుపుతూ ఉండాలి. ఈ పల్లి పొడిని మీరు అన్నానికి పట్టి తింటే మంచిగా ఉంటుంది. ఇంకా దించే ముందు పల్లీలు కొత్తిమీరను వేసి దించుకోవడమే.