
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో భక్తులు తరచూ శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ తిరుపతికి అనేక స్పెషల్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా ఇటీవల మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టగా.. ఇప్పడు ఆ ట్రైన్ టైమింగ్స్‌లో మార్పులు చేసింది. ఆ వివరాలు చూద్దాం.

కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు సర్వీసును జూన్ నుంచి రైల్వేశాఖ నుపుతోంది. అయితే ఇప్పుడు ఈ రైలు టైమింగ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. తిరుపతి-కరీంనగర్(12761) ఎక్స్‌ప్రెస్ రైలు 20.05 గంటలకు తిరుపతిలో బయల్దేరి రేణిగుంటకు 20.28 గంటలకు, శ్రీకాళహస్తికి 20.54 గంటలకు చేరుకునేది. ఇప్పుడు ఈ మూడు స్టేషన్లకు చేరుకునే టైమింగ్స్ మార్చారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వీటిల్లో మార్పులు చేశారు.

కొత్త టైమింగ్స్ ప్రకారం ఈ రైలు 19.50 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది. రేణిగుంటకు 20.15 గంటలకు చేరుకోనుండగా.. శ్రీకాళహస్తికి 2.39 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి మారిన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికులు వీటిని గమనించాలని సూచించింది. ముందే ప్రయాణికులు తీసుకుని జాగ్రత్త పడాలని తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి తిరుపతి నుంచి బయల్దేరి తర్వాతి రోజు కరీంనగర్‌కు చేరుకుంటాయి. ఇక కరీంనగర్-తిరుపతి రైలు సోమవారం సాయంత్రం కరీంగనర్ నుంచి బయల్దేరి మంగళవారం ఉదయానికి తిరుపతికి చేరుకుంటుంది. సాధారణ రైలు సర్వీసుగా ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ రైలు పెద్దపల్లి, జమికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోపడుతుంది. రోజూ వేలాదిమంది ఆయా ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. వారికి ఇది ప్రయోజనకరంగా ఉండనుంది.