
ఇరాన్- ఇజ్రాయెల్- ఆమెరకా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. కేవలం నాలుగు గంటల్లోనే ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి. దీంతో కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. మంగళవారం ఉదయం హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,62,380గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,61,670గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,48,850 ఉండగా ఉదయం ఈ ధర రూ.1,48,190 వద్ద స్థిరపడింది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖ పట్నంలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Gold And Silver Prices

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కేరళ, పూణె వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,62,380 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో ఉదయం 6గంటలకు 2,79,900గా ఉన్న కేజీ వెండి ధర రూ.ఉదయం 10 గంటల సమయానికి రూ.2,90,000 వేలకు చేరుకుంది. అంటే కేవలం 4గంటల్లోనే కేజీ వెండిపై ఏకంగా రూ.10000పైగా పెరిగింది. ఇక హైదరాబాద్ ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది.