ఉప్పొంగుతున్న గోదారి.. లంక గ్రామాల పరిస్థితి ఇదే

Updated on: Aug 03, 2026 | 9:34 AM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది, లంక గ్రామాలను ముంచెత్తుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మామ్మిడివరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణమ్మ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, ఇప్పుడు మనం దంచికొట్టే వానల్లో లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

2 / 5
వర్షాలు విస్తారంగా పడుతుండడంతో గోదావరి పరుగులు పెడుతుంది. క్రమ క్రమంగా ఉధృతి పెరుగుతుంది. దీంతో లంక గ్రామాల్లోకి వదర నీరు చేరడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

3 / 5
ముఖ్యంగా మామ్మిడివరం నియోజక వర్గంలోని శేరిలంక, కమిని, పశువులలంక, గురజాపులంక, కూనలంక, తానేలంక, పొట్టిలంక వీటిల్లోకి వరద నీరు ఎక్కువ మొత్తంలో చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడి లోని చాలా ఇళ్లను ఖాళీ చేయించారు.

4 / 5
అంతేకాకుండా పలు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సహాయ చర్యలు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి హాని లేకుండా ఉండేలా చూసుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. లంక గ్రామాల్లోని చాలా మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు.

5 / 5
గోదావరి నది మాత్రమే కాకుండా మరో వైపు కృష్ణానది వరద ప్రవాహం కూడా విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి కూడా పెరుగుతుండటంతో ప్రజలు, సిబ్బంది  ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు జారీ చేయడం జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us