Health Benefits of Ginger: అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే, అల్లంను ఏ విధంగానైనా ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా అల్లం మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం.. దాని సహాయంతో మనం అనేక రకాల వంటకాల రుచిని పెంచవచ్చు. అయితే ఇది ఏ ఆయుర్వేద ఔషధం కంటే తక్కువ కాదు. దానిని పచ్చిగా నమలి తినొచ్చు.. అల్లం రసం తాగొచ్చు.. సాధారణ టీలో, హెర్బల్ టీతో తీసుకోవచ్చు.. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా, ఇందులో విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫోలేట్ ఉన్నాయి. ఫోలేట్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు లభిస్తాయి. అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..