
మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం..

ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంకా గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి, ఇవి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇవి తగ్గించుకోవటానికి ఈ పల్లెటూరి చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక స్పూన్ ధనియాలను తీసుకుని బాగా వేయించుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా ధనియాలు, అల్లం ముక్క ఉన్న నీటిని పోసి వాటినిపేస్ట్ గా దాని నుంచి రసం తీయాలి. దీనిలో అర టేబుల్ స్పూన్ తేనె కలిపి దీనిని పరగడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి.

మీరు దీనిని వరుసగా రెండు రోజులు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి. ఇంకా కడుపు నొప్పి లాంటి సమస్యలు కూడా పోతాయి. ఈ సమస్యలను అశ్రద్ద చేస్తే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ధనియాలు,అల్లం అందరి ఇళ్ళలో అందుబాటులో ఉంటుంది. దీనిని ఎప్పుడూ ఏదొక రకంగా వాడుతుంటారు. వీటిని తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అయితే, మీరు దీనిని మితంగానే తీసుకోవాలి మరి ఎక్కువగా తీసుకోకండి. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)