
పల్లెటూర్లలో ఎక్కడ చూసిన పాములే ఎక్కువ కనిపిస్తాయి. వాళ్లు ఎన్ని కర్రలు తీసుకుని వెంటపడిన అవి వస్తూనే ఉంటాయి. ఒకసారి వచ్చిన ప్రదేశానికి అవి మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే, పాములు మనుషుల మాట్లాడుకునే మాటలన్నీ వింటాయి.

బంతి పూలు: అందరి ఇళ్లలో బంతిపూలు ఉంటాయి. బంతి పూల వాసన పాములు ఒకసారి పీల్చితే ఆ దరి దాపుల్లో కూడా ఉండవు. కాబట్టి, మీ ఇంట్లో బంతి పుల మొక్కను పెంచండి. దీనిలో ఉండే ఒక రసాయనం పాములను భయపెడుతుంది.

వెల్లుల్లి, ఉల్లి: వెల్లుల్లి, ఉల్లి నార్మల్ గానే ఘాటు వాసన వస్తాయి. దీనిలో ఉండే సల్ఫర్ వాసన పాములు పీల్చితే దాని శరీరం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఇవి మీ పెరట్లో లేకపోయినా తెచ్చి నాటండి. దీంతో అవి మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

గులాబీ: ముళ్ళు ఉన్న మొక్కలన్నా పాములకు చాలా భయం. ఎందుకంటే, దాని చర్మం సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి ముళ్లు ఉన్న మొక్కలను కూడా మీ ఇంట్లో పెంచుకోండి. అవి ఎక్కడా గుచ్చుకుంటాయేమోనని లోపలికి రాకుండా ఉంటాయి.

సర్పగంధ: దీని పేరులోనే ఉంది పాము ఉంది. ఈ మొక్క పాములను రాకుండా చేస్తుంది. అలాగే, ఈ వాసనను ఒకసారి పాము పీలిస్తే మళ్ళీ మీ ఇంటి వైపు కూడా రావు. పాములకు ఈ మొక్క వాసన అసలు ఇష్టం ఉండదు. ఆయుర్వేదంలో కూడా దీనిని వాడుతారు.