Hair Care Tips: జట్టు ఒత్తుగా.. అందంగా మెరిసేలా కనిపించాలంటే..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

|

Apr 12, 2022 | 9:23 AM

Healthy Hair Care: ప్రస్తుత కాలంలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. షాంపూ తర్వాత కండీషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కండీషనర్‌తో పాటు మీరు హెయిర్ రిన్స్‌ (శుభ్రపరచడం) చేయడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేయవచ్చు. ఈ హోం రెమెడీస్ తో నేచురల్ హెయిర్ రిన్స్ చేస్తే ఎంతో మేలని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 5
బేకింగ్ సోడా: ఒక చెంచా బేకింగ్ సోడా దానిలో కొన్ని నీళ్లు వేసి పేస్ట్ లా తయారు చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు అప్లై చేసి.. కొన్ని నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. దీని తరువాత ఖచ్చితంగా జుట్టుకు కండీషనర్ వర్తించండి. దీంతో జుట్టు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.

2 / 5
బ్లాక్ టీ: జుట్టును శుభ్రం చేయడానికి బ్లాక్ టీ బ్యాగ్‌లను నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత తలస్నానం చేసేటప్పుడు ఈ టీ ఆకుల నీటిని జుట్టుకు పట్టించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

3 / 5
ఆపిల్ సైడర్ వెనిగర్: ఇది జుట్టు సంరక్షణలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. దీనితో తయారు చేసిన హెయిర్ రిన్స్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొంచెం నీటిలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ చేయడానికి ముందు ఇది జుట్టుకు అప్లై చేయండి.

4 / 5
అలోవెరా రిన్స్: జుట్టు సంరక్షణ విషయానికి వస్తే కలబంద ఔషదంలా పనిచేస్తుంది. కలబంద జెల్ వేసి నీటిని మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టులో ఉండే చుండ్రు తొలగిపోతుంది.

5 / 5
నిమ్మరసం: చుండ్రు తొలగించడానికి నిమ్మకాయ రసం బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక కప్పులో నీరు తీసుకుని, దానికి రెండు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించండి. ఆతర్వాత షాంపూతో శుభ్రం చేసుకోని.. కండీషనర్ చేసుకోవాలి.