మీరు ప్రతి పనికి టైం టేబుల్‌ను తయారు చేసుకున్నట్టయితే, నిద్ర లేవడానికి టై టేబుల్‌ని తయారు చేసుకోండి. అలాగే, మీరు అనుకున్న సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి.
ఈ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా గాడ్జెట్‌లకు అంటిపెట్టుకుని ఉంటున్నారు. అయితే, మీరు నిద్రపోయేటప్పుడు గాడ్జెట్‌లకు దూరంగా ఉంటే, మీరు వేగంగా నిద్రపోతారు.
వెలుతురులో కంటే చీకటిలోనే నిద్ర బాగా పడుతుంది. కాబట్టి, పడకగదిలో మంచి నిద్ర వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు మీ బెడ్‌రూమ్‌లో తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోండి.
తాగుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మద్యం. కానీ, మద్యం సేవించడమే కాదు.. రాత్రి పడుకునే ముందు టీ-కాఫీ తాగడం కూడా మానేయటం మంచిది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది నిద్రకు కూడా సహాయపడుతుంది.