Dark Underarms: చంకలో నల్లని మచ్చలా..? ఈ హోమ్ రెమెడీస్‌తో వెంటనే చెక్ పెట్టేయండిలా..

|

Sep 03, 2023 | 11:06 AM

Dark Underarms: బాహ్యం ప్రపంచానికి కనిపించే భాగాలు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వాటిలో అండర్ ఆర్మ్‌ కూడా ఒకటి. ఎప్పుడూ చెమట లేదా తేమగా ఉండడం వల్ల అండర్ ఆర్మ్స్‌‌‌లో నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకోవాలనుకునేవారికి అవి చాలా ఆటంకంగా ఉంటాయి. ఈ క్రమంలో మీరు కూడా డార్క్ అండర్‌ ఆర్మ్స్‌తో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ చిట్కాలను పాటించండి..

1 / 5
బేకింగ్ సోడా: దాదాపు ప్రతి వంట గదిలో కనిపించే బేకింగ్ సోడా డార్క్ అండర్‌ ఆర్మ్స్‌కి చెక్ పెట్టగలదు. ఇందుకోసం మీరు బేకింగ్ సోడా పేస్ట్‌ తయారుచేసి, వారంలో రెండు సార్లు అండర్‌ ఆర్మ్స్‌లో అప్లై చేయండి. అప్లై చేసిన 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే చాలు.

2 / 5
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెకు ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించగల శక్తి ఉందని అందరికీ తెలుసు. ఇంకా ఇది డార్క్ అండర్‌ ఆర్మ్స్‌లో మచ్చలను కూడా తొలగించగలదు. ఈ కొబ్బరి నూనెతో ప్రతిరోజూ మీ అండర్ ఆర్మ్స్ మసాజ్ చేసి, మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిలోని విటమిన్ ఇ కారణంగా మచ్చలు పోతాయి.

3 / 5
ఆపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ కొవ్వును తగ్గించడమే కాకుండా మృతకణాలను నివారిస్తుంది. సహజమైన క్లెన్సర్‌గా పనిచేసే ఆపిల్ సైడర్ వెనిగర్‌తో డార్క్ అండర్‌ ఆర్మ్స్‌లోని మచ్చలను కూడా తొలగించుకోవచ్చు. ఇందుకోసం మీరు 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన పేస్ట్‌ను అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేయండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి, ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే వెంటనే మచ్చలు పోతాయి.

4 / 5
ఆలివ్ నూనె: మగువలు తమ అందాన్ని పెంచుకోవడానికి ఆలివ్ ఆయిల్ ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. డార్క్ అండర్‌ ఆర్మ్స్‌కు చెక్ పెట్టాలనుకుంటే.. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపితే ఇది ఎక్స్‌ఫోలియేటర్‌గా ఉపయోగపడుతుంది. ఇక దీన్ని అండర్ ఆర్మ్స్ పై అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తరువాత కడిగి శుభ్రం చేసుకోవాలి.

5 / 5
నిమ్మకాయ: నిమ్మకాయ ఆరోగ్యానికే కాక అందంలోనూ ఉపయోగపడుతుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లను కలిగిన నిమ్మకాయ రసాన్ని స్నానం చేసే ముందు అండర్ ఆర్మ్స్‌లో అప్లై చేస్తే చాలు. తక్షణమే ఫలితాలను గమనిస్తారు.