పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు.. కారణం ఇదే అంటున్న నిపుణులు

Edited By:

Updated on: Aug 01, 2026 | 2:52 PM

పదిమంది టెస్ట్ చేయించుకుంటే అందులో ఆరుగురు లేదా ఏడుగురికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. మందు ఇతర దురవాట్లు లేకున్నా కూడా లివర్ సంబంధించిన వ్యాధులతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవల ఈ కేసులు వేగవంతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. మనం తింటున్న ఆహారం కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఫ్యాటీ లివర్ ప్రాణాలు తీసే అవకాశం ఉంది. పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులపైన స్పెషల్ స్టోరీ.

1 / 5
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ప్యాటీ లివర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య ఉందని బయటపడుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రో డాక్టర్ల వద్ద ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ రోగం విజృంభిస్తుంది. గతంలో ఆల్కహాల్, అధిక మాంసాహారం తిన్నవారికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు ఆల్కహాల్ తో సంబంధం లేకుండానే ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. ముఖ్యంగా యువత ఉబకాయం ఉన్నవారికి ఫ్యాటీ లివర్ సమస్య 80 శాతానికి పైగా కనబడుతుంది.

2 / 5
 అదేవిధంగా విపరీతమైన స్వీట్లు, కల్తీ ఆహారం కారణంగా ఈ వ్యాధి వేగవంతంగా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ ని గుర్తించడం చాలా కష్టంగా మారిపోయింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే లివర్ క్షీణిస్తుంది. మూడో స్టేజి కి వచ్చిన తర్వాత రోగ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో అప్పటికి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇటీవల కాలంలో లివర్ సంబంధిత వ్యాధులతో చనిపోయిన కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా యువత ఫాస్ట్ ఫుడ్ తో పాటు కూల్ డ్రింక్స్ అధికంగా సేవిస్తూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అదేవిధంగా చెడు అలవాట్లు ఉన్నవారు ఈ రోగం మరింత వేగంగా వ్యాపిస్తుంది. చాలామందికి మొదటి దశ ఫ్యాటీ లివర్ లక్షణాలు ఉన్నాయి. ఎన్నడూ లేనివిధంగా గత ఐదు ఏళ్ల నుంచి ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

3 / 5
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులతో ఇబ్బంది పడుతున్నారు. పది పదిహేనేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఫ్యాటీ లివర్ సమస్య వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా యాబైయేళ్లు దాటిన తర్వాత ఫ్యాటీలివర్ సమస్య సహజంగా ఉంటుంది. కానీ జీవన శైలిలో మార్పు రావడంతో పాటు యువత ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడంతో ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ముందుగా గుర్తిస్తే ఫ్యాటీ లివర్ పెద్ద సమస్య కాదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బయట ఆహారానికి దూరంగా ఉండి, ఒక గంట సేపు నడక లేదంటే ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాటీ లివర్ ని తరిమికొట్టవచ్చని కానీ చాలామందికి అవగాహన లేకపోవడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తర్వాతనే ఆసుపత్రి వెళ్తున్నారు. అదేవిధంగా కలుషితమైన నీరు కూడా సమస్యగా మారిపోతుంది. పూర్తిగా జీవన శైలిలో మార్పు రావడంతోనే ఫ్యాటీ లివర్ పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ కేసులు మరింత వేగవంతంగా పెరగడంతో చాలా కుటుంబాలు మానసికంగా ఇబ్బంది పడుతున్నాయి.

4 / 5
బాగా కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలోకి వచ్చానని, లివర్ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారని పేషెంట్లు అంటున్నారు. మూడు రోజుల నుంచి ఆసుపత్రిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నామని అంటున్నారు.బయట ఏదైనా ఆహారం తిందామంటేనే భయం వేస్తుందని పేషంట్ చెపుతున్నారు. లివర్ సమస్యతో ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యామని అంటున్నారు. కల్తీ ఆయిల్ తో పాటు కల్తీ ఆహారం కారణంగానే ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు

5 / 5
ఫ్యాటీ లివర్ కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కల్తీ ఆహారం జీవనశైలిలో మార్పులు రావడంతోనే చాలామందికి ఈ సమస్య వస్తుందని తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు ఆహారం అలవాట్ల మార్పుతో ఫిజికల్ ఎక్సైజ్ చేస్తే ఈ రోగం నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us