
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఆహారం విషయంలో చాలా సందేహిస్తుంటారు. ఎలాంటివి తీసుకోవాలి? ఎలాంటివి తీసుకోకూడదు అనే డౌట్ ప్రతి ఒక్కరిలో మెదులుతుంటుంది. అయితే ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడేవారు అధిక చక్కెర ఉన్న ఆహారాలకు చాలా దూరం ఉండాలంట. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్లు, జ్యూస్‌ల వంటివి అస్సలే తీసుకోకూడదు.

అదే విధంగా మైదా, వేయించిన, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం, అధికంగా ఉప్పు వాడంటం కూడా చేయకూడదంట. కాగా ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిదో ఇప్పుడు మనం చూద్దాం.

అవకాడో, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇందులో కొవ్వులు, పీచు పదార్థం. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీరు దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. అంతే కాకుండా పనీర్ కూడా చాలా బెస్ట్. ఇందులో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట.

అలాగే గింజలు విత్తనాలు, బాదం, వాల్ నట్స్, పొద్దు తిరుగుడు గింజలు, చియా గింజలు, అవిసె గింజలు వంటివి కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా, కాలేయ ఆరోగ్యానికి కూడా ఇవి అనేక విధాలుగా మేలు చేస్తాయి. గ్రీక్ పెరుగు కూడా తీసుకోవచ్చును. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అదే విధంగా దోసకాయ, సెలరీ వంటి కూరగాయలు, తాజా పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నోట్ : పై సమాచారం కేవలం ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.