
పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. అందుకే బీపీ సమస్య ఉన్నవారు పచ్చిమిర్చి తినాలని సూచిస్తుంటారు. ఎందుకంటే మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దానిలోని సిట్రిక్ యాసిడ్ రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది హై బీపీ సమస్యను నియంత్రిస్తుంది.

పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో క్యాప్సైసిన్, కెరోటిన్, క్రిప్టోక్సాంటిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. అమైనో ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. ఇది జీర్ణసంబంధిత ఎంజైమ్‌లను పెంచుతుంది.

విటమిన్ సి పచ్చి మిరపకాయలలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది చర్మం మరింత కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పచ్చి మిరపకాయలు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది వృద్ధాప్యంతో పోరాడటానికి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

పచ్చి మిరపకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు అలసిపోతారు. ఇలాంటి వారు తమ ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ వంటి పోషకాలు పచ్చి మిర్చిలో ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పచ్చమిర్చి వృద్ధాప్యం నుంచి రక్షిస్తుంది. కంటిశుక్లం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఎముకలలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది.