Ramaphal Health Benefits: ఇది పండు కాదు.. ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Feb 22, 2024 | 3:43 PM

సీతా ఫలం అందరికీ తెలుసు.. కానీ, చాలా మందికి రామా ఫలం గురించి పెద్దగా తెలియదు.. సీతాఫలం వంటిదే రామా ఫలం..పేరుకు తగినట్లుగానే ఈ ఫలం మన ఆరోగ్యానికి శ్రీరామరక్షగా పనిచేస్తుంది. ఈ ఫలంలో ఎన్నో ఔషధగుణాలు ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. వీటినే ఇండియన్‌ చెర్రీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పండ్లు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇందులో బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది.

1 / 5
రామఫలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికం. రామఫలంలో పోషకాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. మలేరియా, క్యాన్సర్‌కు దారితీసే కణాలను నివారించే శక్తి ఈ పండ్లలో ఉన్నాయి. ఆ పండ్లలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, డైటరీ, ఫైబర్ అధికం. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సోడియం, కాల్షియం, ఐరన్, పొటాషియం ఎక్కువ.

2 / 5
రక్తంలో గ్లకోజ్‌ను తగ్గించే గుణం రామఫలంలో ఉంది.
రామ ఫలం తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియ, వైరస్‌ నుంచి రక్షిస్తాయి. అనోనాసిన్, అనోకాటలిన్ వంటి క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. తరచూ రామఫలం తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. రామఫలంలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ చర్మం కాంతిని పెంచుతుంది.

రక్తంలో గ్లకోజ్‌ను తగ్గించే గుణం రామఫలంలో ఉంది. రామ ఫలం తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియ, వైరస్‌ నుంచి రక్షిస్తాయి. అనోనాసిన్, అనోకాటలిన్ వంటి క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. తరచూ రామఫలం తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. రామఫలంలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ చర్మం కాంతిని పెంచుతుంది.

3 / 5
ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ని తగ్గించే గుణం రామఫలానికి ఉంది. వీటిలో బీ-కాంప్లెక్స్, విటమిన్ సీ, పిరిడాక్సిన్ పుష్కలంగా ఉండి మొటిమలను తగ్గించడంలో ఎంతో సాయపడుతుంది. వీటిలోని పిరిడాక్సిన్‌ మెదడు కణాలలో అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

4 / 5
రామఫలంలో విటమిన్‌ సీ పెద్ద మొత్తంలో ఉండి రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది. రామఫలంలో ఉండే క్వినోలోన్స్‌, అల్కలాయిడ్స్‌ వంటివి యాంటీమైక్రోబియల్‌ లక్షణాలను కలిగి ఉండి హానికర బ్యాక్టీరియ, వైరస్‌ నుంచి రక్షిస్తాయి. రామఫలంలో క్యాన్సర్‌ నిరోధక గుణాలు కూడా ఉంటాయి. వీటిలో కనిపించే అనోనాసిన్‌, అనోకాటలిన్‌ వంటివి క్యాన్సర్‌ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధించే సామర్ధ్యం కలిగి ఉంటాయి.

5 / 5
ముఖంపై ముడతలు, మచ్చలు, చారలు వంటి వయసు పైబడే లక్షణాలను రామాఫలం దూరం చేస్తుంది. స్కిన్‌ రాషెస్‌, ఎగ్జిమా వంటి వాటిని ఎఫెక్టీవ్‌గా నివారిస్తుంది. వీటిలోని ఆస్కార్బిక్‌ యాసిడ్‌ చర్మం కాంతిని పెంచడంలో,  హైపర్‌ పిగ్మెంటేషన్‌ నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామఫలం గుజ్జు తలలో పేలు, చుండ్రు, జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.