
చికెన్ అతిగా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేలింది. చికెన్‌లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువ. విటమిన్ బి12, కొలైన్ పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల్లో నరాల వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇది తింటే బలం వస్తుందని డాక్టర్లు చెబుతారు.

పైగా రెడ్ మీట్‌తో పోలిస్తే హెల్త్ రిస్క్‌లు తక్కువ. చికెన్ తో ఇన్ని ప్రయోజనాలున్నా.. అదే పనిగా డైలీ తింటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట.

మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట. పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు కోడి, టర్కీ, బాతు లాంటి మాంసాలు తినడం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది.

ఈ అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పరిశోధకులు దాదాపు 19 సంవత్సరాలు 4వేల మందికి పైగా వ్యక్తులపై రీసెర్చ్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వాటినీ గుర్తించారు.

వారానికి 2 లేదా 3 రోజులు మాత్రమే చికెన్ తినాలని అధ్యయనకారులు సూచించారు. వారానికి 100 గ్రాముల వరకు తింటే ఎలాంటి ముప్పు ఉండదట. క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు సూచించారు.