
కావాల్సిన పదార్థాలు : టమాటాలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు తరిగినవి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు రుచికి సరిపడ.

తయారీలోకి వెళ్లితే.. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే మీడియం సైజులో ఉన్న మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి, ఒక మూకుడు పెట్టి, అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక, ఆవాలు, జీలకర్ర వంటి పోపు దినుసులు వేసి మంచిగా వేగనివ్వాలి.

తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఎంత వేగితే రుచి అంత బాగుంటుంది.

తర్వాత తరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక ఈ కర్ర ప్రిపేర్ చేయడానికి ముందే , ముందు రోజు రాత్రి బఠానీలను తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. అదే విధంగా కర్రీ తయారీకి ముందు బఠానీలను మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా ఉడికితే కర్రీ అంత టేస్టు ఉంటుంది. ఇప్పుడు టమాటాలు మంచిగా వేగిన తర్వాత ఉడకబెట్టిన బఠానీలను వేసి కలుపుకోవాలి.

ఇవి బాగా కలిసి కాస్త ఉడికిన తర్వాత , కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు కలుపుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర వేసి మంచిగా కలిపి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ టమాటో , బఠానీ కర్రీ రెడీ.