వారెవ్వా.. మటన్ తహరీ.. ఇలా చేస్తే ఆ రుచి జన్మలో మరవరు

Updated on: Aug 28, 2026 | 12:06 PM

మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ మటన్‌తో తమకు నచ్చిన ఆహారాన్ని వండుకొని తింటారు. అయితే ఎక్కువగా మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ ఇలా వండుకుంటారు. కానీ రోటిన్‌గా కాకుండా చాలా రుచికరంగా ఉండే మటన్ తహారీ అద్భతంగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఆవ నూనె, మిరియాలు, మటన్ , ఉల్లిపాయలు, టమాటా, యాలకులు పొడి, దాల్చిన చక్కె, షాజీరా, మిరియాలు, లవంగాలు, నల్ల యాలకులు. ధనియాల పొడి, కారం, ఉప్పు, ఘరం మాసాలా, బాస్మతి రైసస్, పచ్చి మిర్చీ, కొత్తిమీర, పూదీనా, బిర్యానీ ఆకు.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా ఒక బౌల్‌లో బియ్యంతీసుకోవాలి. బాస్మతి రైస్ అయినా పర్లేదు, నార్మల్ రైస్ అయినా పర్లేదు.  వీటిని దాదాపు అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి.

3 / 5
అందులో ఆయిల్ వేసి , నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చక్కె, జీలకర్ర, లవంగాలు, షాజీరా వంటివి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో బిర్యానీ ఆకు, లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చీ, పూదీనా, టమాటా ముక్కలు  అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న అరకేజీ  మటన్ అందులో వేయాలి.

4 / 5
మటన్ మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ మంచిగా ఉడికించుకోవాలి. 70 శాతం మటన్ ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి, కారం ఉప్పు, గరం మాసాలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు  మూత పెట్టి అన్నీ మంచిగా కలిసేలా చూసుకోవాలి. తర్వాత మూత తీసి అందులో మనం ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. తర్వాత సరిపడ నీళ్లు పోసుకోవాలి.

5 / 5
అలాగే టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి అందలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని, వడ్డించుకొని తింటే ఈ రుచి మీ జన్మలో మర్చిపోరు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రిపేర్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us