
కావాల్సిన పదార్థాలు : మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ వన్ టీస్పూన్, పసుపు, నూనె, బంగాళదుంపలు, మారిస్ పైపర్, చేప ముక్కలు ముల్లు లేకుండా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నవి, లాగర్ బీర్.

తయారీ విధానం :ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, మిరియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి, అందులో లాగర్ బీర్ పోసి మెల్లి మెల్లిగా మెత్తగా కలిపి పట్టుకోవాలి. దాదాపు 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుంటే, చిప్స్ బాగా వస్తాయి.

తర్వాత బంగాల దుంపలను ఉడికించాలి. తర్వాత వీటిని నీటి నుంచి వేరు చేసి, పిండి, నూనె, కొంచె సాల్ట్ వేసి, బేకింగ్ ట్రేలో వేయాలి. తర్వాత వీటిని పిండిలో ముంచి, మంచిగా కరకరలాడే వరకు వేయించుకోవాలి.

ఆ తర్వాత చేప ముక్కలను తీసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి చేప మునిగిపోయే అంత నూనె పోసి, నూనె బాగా వేడి అయిన తర్వాత చేపల ముక్కలను మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకునున్న పిండి మిశ్రమంలో ముంచి, తర్వాత నూనెలో వేసి బాగా కాల్చుకోవాలి.

ప్రతీ పీస్ మంచిగా కాలేలా చూసుకోవాలి. బంగారు రంగులోకి వచ్చి , కర కర మనేలా ఉన్న సమయంలో వాటిని తీసి వేరే ప్లేట్‌లో వేయాలి. తర్వాత వీటిపై, కొంచెం కారం, ఉప్పు చల్లుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది అంతే!