శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం, వేడిగా తింటే ఇక స్వర్గమే

Updated on: Apr 07, 2026 | 7:30 AM

Easy Chana Dal Rice Payasam recipe in telugu: ఈ రెసిపీని పండుగ సమయాల్లో బాగా చేస్తారు. ఇంకా స్వీట్ లవర్స్ కు అయితే పండగే పండుగ అంత రుచిగా ఉంటుంది. మీరు, మీ ఇంట్లో శనగపప్పు పాయసం ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ ఎలాచేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు శెనగపప్పు, అర కప్పు  బియ్యం, అర కప్పు సేమియా , పావు కిలో బెల్లం, 5 జీడిపప్పులు, 6 బాదం పప్పులు, 6 కిస్ మిస్ లు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర కప్పు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి సేమియాను వేయించుకోవాలి. అలాగే, ఇంకో పాత్రలో శెనగపప్పును ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత  ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని మెత్తగా అయ్యేలా  మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. అలాగే, బెల్లాన్ని కూడా తీసుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద ఒక తెపాలా పెట్టి మూడు కప్పుల పాలు పోసి బాగా మరిగిన తర్వాత  బెల్లం తురుమును వేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
మరుగుతున్న పాలలో బెల్లం మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న శెనగపప్పును వేసి సన్నని మంట మీద ఉంచి బాగా ఉడికించాలి. అయితే, శెనగపప్పు, బియ్యంలో కలిసి పోయే వరకు బాగా తిప్పుకోవాలి.

5 / 5
శెనగపప్పు పాయసాన్ని బాగా ఉడకనివ్వాలి.  ఇలా చేస్తే   రుచి కరంగా ఉంటుంది. ఆ తర్వాత వీటిలో మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10 బాదం పప్పులు, కిస్ మిస్ లు, జీడీపప్పులు కూడా వేసి, ఒక చిన్న గరిటేతో దీనిని మిక్స్ అయ్యేలా కలపాలి. అంతే, వేడి వేడి శెనగపప్పు పాయసం రెడీ.

Follow Us