
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బాదం పప్పు: 1 కప్పు, జీడిపప్పు: 1 కప్పు, పిస్తా పప్పు: 1 కప్పు, గుమ్మడి గింజలు: ½ కప్పు, పుచ్చ గింజలు: ¼ కప్పు, ఎండు కొబ్బరి తురుము: ¼ కప్పు, గింజలు తీసేసిన ఖర్జూరాలు: ½ కప్పు, గసగసాలు: ¼ కప్పు, యాలకుల పొడి: ½ టీస్పూన్, జాజికాయ పొడి: ¼ టీస్పూన్, ఎండు ద్రాక్ష: ½ కప్పు, నెయ్యి: 1 టేబుల్ స్పూన్

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా ఒక పాన్‌ను స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అందులో ఒక కప్పు బాదం పప్పును , ఒక కప్పు జీడిపప్పును వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే మరో కప్పు పిస్తా పప్పును కూడా వేసి కలిపి వేయించాలి. అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత అదే కప్పులో అర కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు పుచ్చకాయ గింజలు వేసి ఒక నిమిషం పాటు తక్కువ మంటపై వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక, పావు కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసి, ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇవి చల్లార బెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి.

ఇప్పుడు అదే మిక్సీ జార్లో అర కప్పు గింజలు తీసేసిన ఖర్జూరాలను వేసి, ముందుగా ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత ఖర్జూరం పేస్ట్, పౌడర్ అన్నీ ఒక బౌల్ లోకి తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ,అందులో గస గసాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి , ఎండు ద్రాక్ష అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.

తర్వాత అన్ని పదార్థాలు చక్కగా కలిసిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్లీ అంతా బాగా కలపాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డూలకు మరింత రుచి, మృదుత్వం వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ మీకు కావల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ.