uppula Raju |
May 09, 2021 | 10:48 AM
బరువు తగ్గడానికి మీరు మీ ఆహారంలో వాము, జీలకర్ర టీని చేర్చవచ్చు. జీలకర్రలో కేలరీలు చాలా తక్కువ. కనుక ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.
వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.
జీలకర్రలోని ఎంజైములు చక్కెరలు, కొవ్వులు కార్బోహైడ్రేట్లను తగ్గిస్తాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
డిటాక్స్ టీ తయారు చేయడానికి మీరు ఒక టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ వాము సరిపోతుంది.
ఈ టీని రుచికరంగా చేయడానికి మీరు తేనె, నిమ్మకాయను కూడా జోడించవచ్చు.