Coconut Water for Immunity: కరోనా కష్టకాలంలో నిశ్చింతగా ఉండడానికి కొబ్బరి నీళ్లను ఈ విధంగా తీసుకోండి.. ఊహించలేనన్ని ప్రయోజనాలు మీ సొంతం..

|

Dec 23, 2022 | 7:01 AM

కరోనా రూపాంతరం చెంది మానవ ప్రపంచంపై మరోసారి విజృంభించాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడం కీలకం. అందుకే భారత ప్రభుత్వం కూడా కరోనాపై పోరడడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరమని ఒక సలహా జారీ చేసింది. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కొబ్బరి నీరు ఒక అద్భుతమైన ఔషధం.

1 / 5
 కరోనా మరల విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు మరోసారి ఆందోళన  చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మనం చేయగలిగినది కేవలం జాగ్రత్తలు పాటించడం ఇంకా శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడం మాత్రమే. ఇక కోవిడ్ కష్టకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీరు మీ ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెడితే చాలు. ఈ క్రమంలోనే మీరు నిత్యం కొబ్బరి నీళ్లను తాగడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. కొబ్బరినీళ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి.

2 / 5
రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ  చియా గింజలు, డ్రై ఫ్రూట్స్‌ను  కొబ్బరి నీళ్లలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.

3 / 5
మీకు కొబ్బరి నీళ్ళను నేరుగా తాగడం ఇష్టం లేకపోతే వాటికి బదులుగా కొబ్బరి పాలను కూడా తీసుకోవచ్చు. ఇందులో కొలెస్ట్రాల్,  కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలోని మెగ్నీషియం, విటమిన్ సి, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాల లోపం తొలగిపోతుంది.

4 / 5
కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఈ డ్రింక్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం చైనా ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. కాబట్టి మీరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి  కొబ్బరి నీళ్లను నిమ్మరసంతో కలిపి తీసుకోండి.

5 / 5
రిబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, పిరిడాక్సిన్, విటమిన్లు,ఫోలేట్స్ వంటి పోషకాలు కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి.  ఇంకా కొబ్బరి నీళ్లలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.