
గృహ వినియోగాలు, వీధి వ్యాపారాల్లో తరచుగా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే తాజాగా చేసిన ఓ సర్వేలో అప్పటికే వాడిన నూనెను దాదాపు 60 శాతం మళ్లీ వాడుతున్నట్లు తేలింది.

ముంబై, ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీలలోని 500 ఆహార వ్యాపారాలు నిర్వహించేవారిని సర్వే చేసిన ఈ సంస్థలు.. వారంతా ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారని గుర్తించారు.

వినియోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే.. క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

అటు దేశంలో.. వినియోగించిన నూనెను మళ్లీ ఏ రూపంలోనూ ఉపయోగించకూడదని ఓ రూల్ ఉంది. ఈ నేపధ్యంలోనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వినియోగించిన నూనెను మళ్లీ ఉపయోగించకూడదనే విధంగా అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు.

ఉపయోగించిన నూనెను మళ్లీ వాడటం.. మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం. దీన్ని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందువల్ల బీపీ, కడుపులో మంట, గ్యాస్, కాలేయ సమస్యలు లాంటివి తలెత్తవచ్చు.

ఒకవేళ మీ వంట పూర్తి అయిన తర్వాత ఆయిల్ మిగిలినట్లయితే.. దాన్ని ఇంటి తలుపులకు, తాళాలు తుప్పు పట్టకుండా కాపాడటానికి వినియోగించండి. అలాగే వినియోగించిన నూనెతో పాటు వెనిగర్ మిశ్రమాన్ని కలిపి చెక్క ఫర్నిచర్‌ను పాలిష్ చేయొచ్చు.