Peanuts Benefits: మీరూ రోజూ పల్లీలు తింటున్నారా? ఈ అలవాటు మీ ఆరోగ్యానికి మేలేనా..

|

Jan 07, 2025 | 3:09 PM

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పల్లీలు ముఖ్యమైనవి. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే రోజూ వారీ ఆహారంలో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే కొంత మంది తెలిసో.. తెలియకో.. వేయించినవి లేదంటే ఉడికించిన పల్లీలు తింటుంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదో.. కాదో.. కూడా తెలుసుకోరు.

1 / 5
చాలా మంది పల్లీలు ప్రతిరోజూ తింటారు. కొన్నిసార్లు పచ్చి, కొన్నిసార్లు వేయించినవి తింటారు. కానీ ఇలా ప్రతిరోజూ పల్లీలు తినడం వల్ల మీ శరీరానికి తెలియకుండానే ఎంతో మంచి జరిగిందని నిపుణులు అంటున్నారు.

2 / 5
వైద్యుల ప్రకారం.. రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ జాబితాలో పల్లీలు ముఖ్యమైనవి. ప్రతిరోజూ పల్లీలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి.

3 / 5
వేరుశెనగలు తినడం వల్ల ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం గుండెకు ఎంతో మంచిది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేరుశెనగ తినడం మంచిది.

4 / 5
వేరుశెనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మీకు డయాబెటిస్ ఉంటే వేరుశనగలను భయం లేకుండా తినొచ్చు. వేరుశెనగలో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగలో విటమిన్ ఇ ఉండటం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

5 / 5
ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్స్ వయస్సు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు వేరుశెనగలకు దూరంగా ఉండాలి. ఇందులో చాలా కేలరీలు ఉంటాయి. వేరుశెనగలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. చాలా మందికి వేరుశెనగ తినడం వల్ల ఎలర్జీ కూడా వస్తుంది. ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.