
శ్రీమద్ భాగవత పురాణంలో పాముల గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చునంట. ఇందులోని ఐదవ భాగం స్కంధంలోని 24వ అధ్యాయనం విశ్వంలోని వివిధ లోకాల గురించి తెలియజేస్తుంది. అలాగే, అతల, వితల, సుతల , తలతల మహాతల, రసతల , పాతాళ లోకాల గురించి తెలియజేస్తుంది. ఇక పాతాల లోకం అంటే సర్పాలు, దేవతలకు సంబంధం ఉన్న లోకం.

అయితే అక్కడ నార్మల్ సర్పాలు కాకుండా శక్తివంతమైన సర్పాలు నివసిస్తాయంట. ముఖ్యంగా వాసుకి, తక్షకుడు వంటి సర్పాలు అక్కడ ఉంటాయంట. ఇక చాలా వరకు ప్రాచీన గ్రంథాలు పాములకు శక్తులు ఉన్నాయని తెలుపుతున్నాయి. కానీ ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్నట్లు కోరికలు తీర్చే పాములకు దైవ సర్పాలకు మధ్య చాలా తేడా ఉంటుందంట.

భారతీయ సంప్రదాయంలో పాములకు చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. పాములను దైవంగా భావించి పూజ చేస్తుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. శివుడు పామును ధరించడం, విష్ణు మూర్తి శేష నాగు పడక ఇలా అన్నింటి వలన పాములను దైవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంతో పోలిస్తే ఇప్పటి పాములు వేరు అని చెబుతున్నారు పండితులు.

మనుషులు కోరిన కోర్కెలు తీర్చే పాములు ప్రాచీన కాలంలో ఉండి ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి పాములు లేవు అని చెబుతున్నారు పండితులు. కానీ ఇప్పటికీ శ్రీమద్ భాగవత పురాణంలో తెలిపిన దివ్య సర్పాలను నేటికి పూజిస్తున్నారు. అవి ఇప్పటికీ నిత్యం పూజలు అందుకుంటున్నాయంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు