భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది. 17 జోన్లుగా విభజించబడిన రైల్వే నెట్‌వర్క్‌లో 19 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఈ రైళ్లకు సొంత కేటగిరీలు ఉన్నాయి. వీటిలో డెమో, ఈమో, మెమో ఉన్నాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ రైళ్లను వినియోగిస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు డెమో, ఈమో, మెమో పేర్లు వినే ఉంటారు. అయితే ఈ మూడు రకాల రైళ్లకు మధ్య తేడా ఏమిటో తెలియదు. వాటి మధ్య తేడా ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం
మెమో (MEMU): దీనిని మెయిన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అంటారు. MEMU రైలు EMU కంటే కొంచెం అధునాతనమైనది. MEMU రైళ్లు సాధారణంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. మెమో రైలులో నాలుగు కోచ్‌ల తర్వాత ఒక పవర్ కారు ఉంటుంది. దీని సహాయంతో ట్రాక్షన్ మోటార్ నడుస్తుంది. MEMU రైలు, EMU రైలు మధ్య తేడా ఎక్కువగా లేదు.
ఈమో (EMU): దీని పూర్తి పేరు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. EMU రైలు సాధారణంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రోలలో ఉపయోగించబడుతుంది. ముంబై లోకల్ రైలు దీనికి ఉదాహరణ. ఈ రైళ్లు నగరం, సబర్బన్ ప్రాంతాలను కలుపుతూ ఉంటాయి. ఈమో ట్రైన్ ఎక్కువ దూరం ప్రయాణం చేయదు. ఈ ట్రైన్ విద్యుత్తుతో నడుస్తుంది. దీనికి విద్యుత్తును అందించే పాంటోగ్రాఫ్ ఉంటుంది. ఇది ట్రాక్షన్ మోటారుకు శక్తిని ప్రసారం చేస్తుంది. తద్వారా రైలు వేగం పుంజుకుంటుంది. ఈమో ట్రైన్ గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
Train
170 ఏళ్ల ప్రస్థానం ఉన్న భారతీయ రైల్వే నెట్‌వర్క్ 45 వేల కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ 1,366 మీటర్లు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. అయితే దక్షిణ కర్ణాటకలోని హుబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో 1505 మీటర్ల పొడవున ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత గోరఖ్‌పూర్ నుండి దేశంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ అనే బిరుదును హుబ్లీ జంక్షన్ సొంతం చేసుకుంటుంది.