
కొన్ని వంటకాలు గూగుల్ మొత్తం ఎంత వెతికినా కూడా దొరకవు. ఎందుకంటే మనిషి ఆకలిని రక రకాలుగా తీర్చుకుంటాడు. ఎవరికీ తోచినంత వాళ్ళు తింటారు. ఆకలి వేసినప్పుడు అన్నమే తినాలని రూల్ లేదు. ఏది దొరికినా కూడా కడుపు నింపుకోవచ్చు. ఇక్కడ చెప్పబోయే రెసిపీ కూడా అదే. ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టినా కూడా దొరకదు.

కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళాదుంప, పచ్చి మిర్చి, నీటిలో నానా బెట్టిన అన్నం. ఈ మూడు చాలు దీని కోసం ఇక వేరే వాటితో పనే లేదు. ఇది మన శరీరానికి ఎంతో బలం.అయితే, మీరు ఈ మూడింటిని కలిపి మాత్రమే తినాలి. అప్పుడే ఇది శరీరానికి కూడా పడుతుంది.

బంగాళాదుంపలో పిండి పదార్థం ఉంటుంది. ఇంకా పచ్చి మిర్చి లో ఘాటు ఉంటుంది. ఇక అన్నం మన శరీరానికి బలం. ముందు మీరు ఒక దుంపను ఉడకబెట్టి పక్కన పెట్టాలి. ఆ తరవాత రెండు పచ్చి మిర్చిని తీసుకుని గిన్నెలో పెట్టాలి. ఇప్పుడు నానాబెట్టిన అన్నం తీసుకుని ఉడికించిన దుంప పేస్ట్ ను దీనిలో కలపాలి.

ఈ పేస్ట్ ను కలిపిన తర్వాత దీనిలో పచ్చి మిర్చి ముక్కలను కూడా దీనిలో కలిపి తింటే ఎలాంటి రోగాలు ఉండవు. మీరు మీ ఇంట్లో ఒకసారి చేసి తినండి. మీకు పక్కాగా నచ్చుతుంది ఇది అంత టేస్టీ ఉంటుంది. దీని కోసం ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి దీనిని ట్రై చేసి పక్కాగా తినండి.

ఇక్కడ మీరు అన్నాన్ని కూడా పేస్ట్ లాగా చేయాలి ఇంకా పచ్చి మిర్చిని కూడా నలిపి తినాలి. అప్పుడే ఇది రుచికరంగా ఉంటుంది. వానల్లో అయితే ఇదే బెస్ట్. వందలు పెట్టె బదులు దీనిని తినడం చాలా మంచిది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినొచ్చు. ఇది మీరు ఎక్కడా వెతికినా కూడా దొరకదు.