Diabetes Care: డయాబెటిస్‌ సమస్య వేధిస్తుందా..? వీటితో షుగర్‌ కంట్రోల్‌.. అవేంటో మీరు తెలుసుకోండి

|

Nov 10, 2021 | 2:30 PM

Diabetes Care: డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. డయాబెటిక్ పెరగకుండా.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మీరు ఆహారంలో ఎలాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
బాదం - బాదం గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. బాదంలోని ఖనిజాలు మీ శరీరం దాని ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా నిర్వహించేలా సహాయపడతాయి. బాదంలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది మంచి ఆహారం.

2 / 5
బీన్స్ - తృణధాన్యాలు, కిడ్నీ బీన్స్, బ్లాక్ గ్రామ్ బీన్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు. అవి రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తాయి. దీంతోపాటు చక్కెర స్థాయిని అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

3 / 5
బచ్చలికూర - ఈ ఆకు కూర ఆరోగ్యానికి ఔషధం లాంటిది. ఒక కప్పు బచ్చలికూరలో 21 కేలరీలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీంతపాటు పాలక్ పన్నీర్, ఆలివ్ నూనెతో చేసిన పాలకూరను కూడా తినవచ్చు. దీనివల్ల డయబెటిస్ అదుపులో ఉంటుంది.

4 / 5
పసుపు - పసుపు యాంటిబయోటిక్ అని మనందరికీ తెలుసు. ఇది ప్యాంక్రియాస్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు ప్రీడయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్‌గా మారకుండా నిరోధించగలదు. మీరు మీ రోజువారీ ఆహారంలో పసుపును చేర్చుకోంటే చాలా మంచిది.

5 / 5
చమోలి టీ - చమోలీ పువ్వులను వివిధ రకాల వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని ఇటీవలి పరిశోధనలో నిరూపితమైంది.