అమృతమే.. పనస పండు హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ

Updated on: Aug 28, 2026 | 3:44 PM

స్వీట్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే ఎప్పుడూ తినే స్వీట్స్ ఎవరికి అయినా సరే బోర్ కొడుతుంది. అయితే ఇప్పుడు మనం వెరైటీగా తమిళనాడు స్టైల్‌లో పనస పండు హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చూడటానికి కాదండోయ్.. తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట.

1 / 5
 వర్షాకాలం ముగిసేలోపు భారత దేశంలో తప్పక చూడాల్సిన ఐదు ప్రదేశాలివే! https://tv9telugu.com/web-stories/travel/monsoon-travel-india-5-must-visit-places-before-the-rains-end

2 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. పనస పండు, తాటి బెల్లం లేదా నార్మల్ బెల్లం, నెయ్యి, జీడిపప్పు, బాదం. తయారీలోకి వెళితే..హల్వా తయారీకి, పనసపండును  తీసుకుని, దాని గింజలను వేరు చేయాలి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్‌లో వేసి  మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు రెండు కప్పుల పనసపండు గుజ్జును మనం హల్వా కోసం ఉపయోగించవచ్చును.

3 / 5
అందువలన మీరు రెండు కప్పులకు సరిపడే విధంగా పనసపండు గుజ్జును తయరాు చేసుకోవాలి. పనస పండు మిక్సీ పట్టి మెత్తని గుజ్జులా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కడాయిలో వేడి చేసి, జీడిపప్పును బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో రుబ్బుకున్న పనసపండు గుజ్జును వేసి, గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి.

4 / 5
అది కాస్త గట్టిపడినట్లు అయిన తర్వాత, ఇందులో  ఒక కప్పు బెల్లం లేదా తాటి బెల్లం వేసుకోవాలి. శుద్ధి చేసిన చక్కెరను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి బెల్లం ఉపయోగించడం మేలు. అలాగే కొన్ని చిన్న చిన్న పనస పండు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకుంటే? హల్వా తింటున్నప్పుడు చిన్న పనసపండు ముక్కలు తగులుతుంటే మరింత రుచికరంగా ఉంటుంది కాబట్టి.

5 / 5
అందువలన పనస పండు గుజ్జులో కొన్ని చిన్న ముక్కలు ఉండేలా చూసుకోవాలి. పాన్‌కు అంటుకోకుండా నిరంతరం కలుపుతూ ఉండగా, దానిలో పనస పండు ముక్కలు కూడా వేసి కలపండి. అది పూర్తిగా దగ్గరపడుతుంది. ఆ సమయంలో చివరగా, వేయించిన జీడిపప్పును వేసి కలిపితే, నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచికరమైన పనసపండు హల్వా రెడీ అవుతుంది. అంతే పనస పండు హల్వా రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us