
ఇది వరకు రోజుల్లో మన తాతల జీవితం హ్యాపీగా గడిచిపోయేది. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం, ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు కదులుతూ ఉండేవి .ఇలా పని చేయడం వల్ల కండరాలు బలంగా అవుతాయి. అందువలన వారు అంత ఫిట్ గా ఉంటున్నారు. డ్యాన్స్ లు కూడా వేయగలుగుతున్నారు

పోషకాహారం : పాత రోజుల్లో మన తాతలు, అమ్మమ్మలు పొలాల్లో పడించినవే ఎక్కువగా తినేవాళ్లు. వాటిలో ఎక్కువగా జొన్నలు, రాగులు, సజ్జలు, కూరగాయలను తీసుకునేవాళ్ళు. అప్పట్లో ఎలాంటి ఫాస్ట్ ఫుడ్స్ లేవు. దీని వలన వాళ్ళు ఈ రోజుల్లో కూడా బలంగా ఉండగలుగుతున్నారు.

రోజువారీ వ్యాయామం :రోజూ నడక, వ్యాయామం తేలికపాటి పనులు చేయడం వల్ల శరీరం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం కంటే కదులుతూ ఉండటం వల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. ఈ అలవాటు వయస్సు పెరిగినా శరీరానికి చురుకుదనం ఇస్తుంది.

ఉత్సాహం, శరీరపని తీరు: ఈ తరం యువత లాగా వాళ్ళు ప్రతి చిన్న దానికి టెన్షన్ పడరు. ఏం జరిగినా కూడా మనసును ఆనందంగానే ఉంచుకుంటారు. చాలా మంది వృద్ధులు సంతోషంగా ఉండటానికి గల కారణం మనసులో ఏం దాచుకోరు టెన్షన్, ఆందోళనలు ఏం పెట్టుకోరు. దీని వలన వాళ్ళు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అందుకే, ఈ రోజుల్లో కూడా డ్యాన్స్ వేయగలుగుతున్నారు.

అలవాట్లు : పని ఒత్తిడి లేకపోవడంతో టైమ్ కి తినకపోవడం, నిద్రపోవడం, తమ అలవాట్లను సరిగ్గా పాటించడం వలన , వృద్ధులు అంత శక్తీవంతంగా ఉండగలుగుతున్నారు.అలాగే, వారు డైలీ కొన్ని చిన్న చిన్న వ్యాయమాలు కూడా చేస్తారు. ఇలా చేస్తే వారు ఎక్కువ కాలం ఎనర్జీ గా ఉంటారు. ఎలాంటి డ్యాన్స్ స్టెప్పులైన ఆదరగోడతారు.