
కావాల్సిన పదార్థాలు: పొడి బియ్యంపిండి - 2 కప్పులు, పుట్నాలు (వేయించిన శనగపప్పు) - 3/4 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా కారం - 1 టీస్పూన్, వాము - 1/2 టీస్పూన్, నల్ల నువ్వులు - 2 టీస్పూన్లు (లేదా తెల్ల నువ్వులు/ఆనియన్ సీడ్స్), ఇంగువ - 1/4 టీస్పూన్ నీరు - 2 కప్పులు (బియ్యంపిండికి సమానమైన కొలత), వేయించడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్ పెట్టి, అందులోకి రెండు కప్పుల పొడి బియ్యంపిండిని తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, పిండిని రంగు మారకుండా 3-4 నిమిషాలు బాగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల మురుకులకు రుచి వస్తుంది. పిండి వేడెక్కగానే ఒక బౌల్‌లోకి మార్చుకోండి.

అదే సమయంలో, ఒక మిక్సీ గిన్నెలోకి ముప్పావు కప్పు పుట్నాలను తీసుకుని, మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పుట్నాల పిండిని జల్లెడ పట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యంపిండిలో కలపండి. జల్లెడ పట్టిన తర్వాత మిగిలిన రవ్వ వంటి పదార్థాన్ని పక్కకు తీసివేయండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ కారం, అర టీస్పూన్ వాము, రెండు టీస్పూన్ల నల్ల నువ్వులు పావు టీస్పూన్ ఇంగువ వేసి బాగా కలపండి. పిండి కలిపిన తర్వాత, అదే పాన్‌లో రెండు కప్పుల నీళ్లను తీసుకుని వేడి చేయండి. ఈ నీళ్లు బాగా వేడి అవ్వాలి.

వేడి చేసిన నీళ్లను నెమ్మదిగా పిండి మిశ్రమంలో పోస్తూ, ఒక చెంచాతో బాగా కలపండి. రెండు కప్పుల బియ్యంపిండికి రెండు కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి. నీళ్లు వేడి కాబట్టి వెంటనే చేత్తో కలపకుండా మూత పెట్టి, ఐదు నుంచి పది నిమిషాలు పక్కన ఉంచండి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత, మూత తీసి బాగా కలపండి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి కలపవచ్చు. పిండి మరీ సాఫ్ట్‌గా ఉండకుండా సెమీ-సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. మరీ సాఫ్ట్‌గా ఉంటే మురుకులు నూనెను ఎక్కువగా లాగేస్తాయి. పిండిని నొక్కి చూస్తే సెమీ-సాఫ్ట్‌గా, కొంచెం బరకగా అనిపించాలి.

స్టార్ గుర్తు ఉన్న బిళ్లను జంతికల గొట్టానికి సెట్ చేయండి. గొట్టానికి లోపల కొద్దిగా నూనెను అప్లై చేసి, సిద్ధంగా ఉన్న పిండిని అందులో నింపండి. మిగిలిన పిండి ఆరిపోకుండా కప్పి ఉంచండి. ఒక పెద్ద స్టీల్ ప్లేట్‌కు నూనె రాసి, దానిపై రెండు లేదా మూడు చుట్ల చుట్టి మురుకుల షేప్‌లో ఒత్తండి. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేయండి. నూనె చక్కగా వేడయ్యాక, ప్లేట్‌పై చేసిన మురుకులను జాగ్రత్తగా తీసుకుని నూనెలో వేయండి. నూనెలో వేసిన వెంటనే తిప్పకుండా, ఒక పక్కన కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకు తిప్పి వేయించాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. పైన నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు వేయించాలి. నురగ తగ్గిపోయిందంటే మురుకులు బాగా ఫ్రై అయ్యాఈ ప్రక్రియను మొత్తం పిండి అయిపోయే వరకు కొనసాగించండి. ఈ పద్ధతిలో చేసిన మురుకులు చాలా ఈజీగా, ఎక్స్ట్రా క్రిస్పీగా, రుచికరంగా వస్తాయి.