IPL 2023 మెగా వేలానికి ముందు బెంగళూరు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ ప్లేయర్ల లిస్ట్ జాబితా నుంచి తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది.
2014 ఐపీఎల్ మొదలు 2021 వరకు ఐపీఎల్‌లో ఆర్సీబీ టీమ్‌లో చాహల్ మెయిన్ బౌలర్‌గా ఉన్నాడు. అన్నిటికీ మించి టీమ్ ఇండియాలోకి కూడా అడుగుపెట్టాడు. అతను RCB విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపుపొందాడు. 3.అయితే ఉన్నట్లుండి RCB చాహల్‌ని జట్టు నుండి తప్పించింది. ఆ సమయంలో స్పందించని స్పిన్నర్ ఇప్పుడు తన బాధను బయటపెట్టాడు.
అయితే ఉన్నట్లుండి RCB చాహల్‌ని జట్టు నుండి తప్పించింది. ఆ సమయంలో స్పందించని స్పిన్నర్ ఇప్పుడు తన బాధను బయటపెట్టాడు.
'ఆర్‌సీబీ తరఫున 8 ఏళ్లు ఆడాను. ఈ జట్టు నాకు ఇండియా క్యాప్ ఇచ్చింది. అన్నిటికీ మించి తొలి మ్యాచ్ నుంచే విరాట్ భయ్యా నాపై నమ్మకం ఉంచాడు. ఆర్సీబీ నా కుటుంబం లాంటిది' అని చాహల్ చెప్పుకొచ్చాడు.
అయితే RCB నన్ను వదిలించుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఈ విషయంపై కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. బెంగళూరు తరఫున 114 మ్యాచ్‌లు ఆడాను. వేలంలో కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ, అది జరగలేదు. దీంతో నాకు చాలా కోపం వచ్చిందిని ఆర్సీబీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు చాహల్. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.