WTC Final 2023: టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా సిక్సర్ కింగ్ అతనే..! రెండో స్థానంలో ఎంఎస్ ధోని.. అగ్రస్థానం ఎవరిదంటే..?

|

Jun 06, 2023 | 2:49 PM

WTC Final 2023: అందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఓవల్ వేదికా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ సిక్సర్ కొడితే చాలు.. సచిన్‌ పేరిట ఉన్న టెస్ట్ క్రికెట్ సిక్సర్ల రికార్డ్ బద్దలవుతుంది.

1 / 7
WTC ఫైనల్ 2023: భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 5 రోజుల పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక్క సిక్సర్ బాదితే.. టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ని అధిగమించగలడు.

2 / 7
టీమిండియా తరఫున మొత్తం 329 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 69 సిక్సర్లు బాదాడు. అలాగే ఇప్పటివరకు 83 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 69 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే హిట్‌మ్యాన్ కేవలం ఒక్క సిక్స్ కొడితే చాలు.

3 / 7
అయితే టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టులు ఆడిన వీరూ 91 సిక్సర్లు బాది ఈ రికార్డు సృష్టించాడు.

4 / 7
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా 2వ స్థానంలో ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు.

5 / 7
329 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

6 / 7
83 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు.

7 / 7
అలాగే 184 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.