ఓవల్‌లో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై అజేయంగా 44 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 60 బంతులు ఎదుర్కొన్న విరాట్ 7 ఫోర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు. తద్వారా మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో 5000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
అలాగే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 2000 పరుగులు పూర్తి చేసిన ఐదవ భారత ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. విరాట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (3630), వీవీఎస్ లక్ష్మణ్ (2434), రాహుల్ ద్రవిడ్ (2143), చేతేశ్వర్ పుజారా (2033)లు ఈ ఘనత అందుకున్నారు.
WTC 2023 ఫైనల్ చివరి రోజును భారత్ 164/3 వద్ద ముగించింది, చివరి రోజు ఏడు వికెట్లు చేతిలో ఉండగా మ్యాచ్ గెలవడానికి మరో 280 పరుగులు చేయాల్సి ఉంది.