
ఇక దుబాయ్‌లో అందరికంటే అత్యధిక వ్యక్తిగత స్కోర్ ప్లేయర్‌గా మన టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ నిలిచాడు. 2018 ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 127 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పసికూన జట్టుపై తన పంజా విసిరాడు. గబ్బర్ దెబ్బకు హాంకాంగ్ విలవిల్లాడిపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనర్‌గా శిఖర్ ధావన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.

2013లో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ప్లేయర్ అహ్మద్ షాజాద్ మంచి బ్యాటింగ్ చేశాడు. 124 పరుగులతో పాక్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. కానీ, పాకిస్థాన్ నిర్దేశించిన టార్గెట్‌ను శ్రీలంక ఛేదించించేసింది. రెండు వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌లో లంక విజయం సాధించింది.

ఆసియా కప్ 2018 లోనే ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ మహ్మద్ షెహజాద్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. టీమిండియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో షెహజాద్ 116 బంతుల్లో 124 పరుగులు సాధించి, టీమిండియాను దాదాపు ఓడించినంత పనిచేశాడు. అతని బ్యాటింగ్‌తో ఆఫ్గాన్ 252 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ, టీమిండియా సైతం 252 పరుగులే చేయడంతో చివరికి మ్యాచ్ టైగా ముగిసింది.

2018 ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ లిట్టన్ దాస్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇండియతో జరిగిన మ్యాచ్‌లో 117 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియానే విజయం సాధించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2010లో తొలి వన్డే మ్యాచ్ తర్వాతి. అయితే తొలి వన్డే జరిగిన ఏడాది తర్వాత సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా ఈ గ్రౌండ్‌లో సెంచరీ చేశాడు. ఈ స్టేడియంలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌పై దక్షిణాఫ్రికా 2 పరుగుల తేడాతో గెలిచింది.