IPL 2023: ‘ఆరెంజ్ క్యాప్’ పోటీలో ఉన్న టాప్ 5 ఆటగాళ్లు వీరే.. ఎవరెవరు ఎన్ని పరుగుల బాదారంటే..?

|

Apr 24, 2023 | 1:45 PM

ఐపీఎల్ 16వ సీజన్‌లో మ్యాచ్‌తలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లు కనీసం ఒకరైనా హాఫ్ సెంచరీ కొట్టకుండా వెనుదిరగడంలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే అరెంజ్ క్యాప్ ఎవరి దగ్గర ఉందో.. ఆ క్యాప్ కోసం పోటీలో ఉన్న టాప్ 5 ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

1 / 5
అరెంజ్ క్యాప్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ దగ్గర ఉంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన ఫాఫ్ 67.50 యావరేజ్‌తో మొత్తం 405 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ర్టైక్ రేట్ 165.30.

2 / 5
ఫాఫ్‌కి పోటీగా రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డెవాన్ కాన్వే ఉన్నాడు. కాన్వే ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 52.33 సగటుతో 314 పరుగులు చేశాడు. ఇక ఈ క్రమంలో అతని స్రైక్ రేట్ 143.37 గా ఉంది.

3 / 5
ఈ లిస్టులో ఢిల్లీ కెప్టెన్ వార్నర్ మామ కూడా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 285 పరుగులు చేయడం ద్వారా వార్నర్ అరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5 ఆటగాళ్లలో 3వ ఆటగాడిగా ఉన్నాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సగటు 47.50 కాగా స్ర్టైక్ రేట్ 120.76.

4 / 5
కింగ్ కోహ్లీ లేకుండా ఏ లిస్టు అయినా ఉంటుందా..? అందుకే విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు. 141.62 స్ర్టైక్ రేట్‌తో మొత్తం 279 పరుగులు చేశాడు కోహ్లీ. ఈ సీజన్‌లో తను ఆడిన 7 ఆటలలో అతని యావరేజ్ 46.50.

5 / 5
చెన్నై టీమ్‌కి చెందిన మరో ఆటగాడు కూడా ఈ లిస్టులో ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో 270 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ 45.00 సగటుతో 5వ స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ సీజన్‌లో అతని స్ర్టైక్ రేట్ 147.54.