Tilak Varma, IND vs WI 2nd T20: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 51 పరుగులతో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను తన కంటే సీనియర్ ప్లేయర్ అయిన రిషభ్ పంత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌కి ముందు భారత్ తరఫున టీ20 హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రిషభ్ పంత్ రెండో స్థానంలో ఉండేవాడు. అయితే వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ ఆ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. రిషభ్ పంత్ 21 ఏళ్ల 38 రోజుల వయసులో తొలి టీ20 నమోదు చేయగా.. తిలక్ వర్మ 20 ఏళ్ల 271 రోజుల వయసులోనే ఆ ఘనత సాధించాడు.
దీంతో భారత్ తరఫున టీ20 హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా తిలక్ అవతరించాడు. ఇక ఈ లిస్టు అగ్రస్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.
2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిపించాడు. అప్పటికి రోహిత్ శర్మ వయసు 20 ఏళ్ల 143 రోజులే కావడంతో భారత్ తరఫున టీ20 అర్ధశతకం చేసిన అత్యంత పిన్ని వయస్కుడిగా హిట్ మ్యాన్ చరిత్రకెక్కాడు.
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 ద్వారా ఆరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఆ మ్యాచ్‌లో అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో 39 పరుగులు చేశాడు. దీంతో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన టీమిండియా ప్లేయర్‌గా అగ్రస్థానంలోకి చేరాడు.