
T20 World Cup 2026: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా కీలక ఆటగాడు తిలక్ వర్మ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఈ ఫిట్ నెస్‌తో అతను టీ20 ప్రపంచ కప్‌లో ఆడడం ఖాయమైంది.

టీ20 ప్రపంచ కప్‌నకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికైన ఎడమచేతి వాటం స్పిన్నర్ తిలక్ వర్మ కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. విజయ్ హజారే టోర్నమెంట్ సందర్భంగా గజ్జల్లో గాయం కారణంగా ఆయనకు శస్త్రచికిత్స జరిగింది.

అతను ఇప్పుడు ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఫిబ్రవరి 3న అతను భారత జట్టులో చేరనున్నట్లు సమాచారం. అంటే, దీని అర్థం తిలక్ వర్మ టీ20 ప్రపంచ కప్‌లో మైదానంలో ఉండటం దాదాపు ఖాయం.

దీంతో, తిలక్ వర్మ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్‌ను టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపిక చేయకపోవడమే ఖాయం. ఎందుకంటే, టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ భారత జట్టులో చేరనున్నాడు. ఇది భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు.

తిలక్ వర్మ టీ20ఐ కెరీర్ ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లు ఆడి 1183 పరుగులు చేశాడు. ఇందులో 120 పరుగులతో అజేయంగా అత్యధిక స్కోర్ సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 91 ఫోర్లు, 61 సిక్స్‌లు బాదేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్.