Team India: హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా యంగ్ ప్లేయర్.. లిస్టులో ఎవరున్నారంటే?

|

Sep 06, 2023 | 5:25 PM

Shubman Gill Records: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌తో కలిసి 147 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యువ ఓపెనర్ గిల్.. 62 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ టీమిండియా వజియం సాధించి, సూపర్ 4లో చోటు దక్కించుకుంది. నేటి నుంచి ఆసియా కప్‌లో సూపర్ 4 మ్యాచ్‌లు మొదలయ్యాయి.

1 / 8
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌తో టీమిండియా సూపర్ 4 దశకు చేరుకుంది. లీగ్ స్థాయిలో జరిగిన ఏకైక మ్యాచ్‌లో నేపాల్‌పై గెలిచిన పాకిస్థాన్.. సూపర్ 4 దశకు చేరుకుని, నేడు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది.

2 / 8
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌తో కలిసి 147 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యువ ఓపెనర్ గిల్.. 62 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

3 / 8
ఆసియా కప్ మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో చెలరేగిన గిల్.. అతి తక్కువ వన్డేల్లో 1500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. 63.08 సగటుతో గిల్ వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ, మూడు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి.

4 / 8
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ గిల్‌కి 50 ఓవర్ల ఫార్మాట్‌లో 29వది. ఈ మ్యాచ్‌లో గిల్ 67 పరుగుల ఇన్నింగ్స్ ద్వారా 1514 వన్డే పరుగులను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని చాలా త్వరగా సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

5 / 8
ఈ రికార్డుతో దక్షిణాఫ్రికా దిగ్గజ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. హషీమ్ ఆమ్లా 30 ఇన్నింగ్స్‌ల్లో 1500 వన్డే పరుగులు చేసి ఈ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.

6 / 8
ఆమ్లాతో పాటు, నెదర్లాండ్స్‌కు చెందిన ర్యాన్ టెన్ డోస్కెట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ 32 వన్డే ఇన్నింగ్స్‌లలో 1500 పరుగులు చేసిన రికార్డును లిఖించారు. ఈ ముగ్గురి తర్వాత ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన బాబర్ ఆజం కూడా 32 వన్డేల్లో 1500 పరుగులు పూర్తి చేశాడు.

7 / 8
భారతీయుల విషయానికొస్తే, గిల్ కంటే ముందు, భారత్ తరపున వేగంగా 1500 వన్డే పరుగులు చేసిన రికార్డు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ పేరిట ఉంది.

8 / 8
10 డిసెంబర్ 2017న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన 28 ఏళ్ల అయ్యర్, 1500 వన్డే పరుగులను చేరుకోవడానికి 34 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.