రవి బిష్ణోయ్, దీపక్ హుడా అరంగేట్రం.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్‌కు ఆడతారు. రవి బిష్ణోయ్ యువ లెగ్ స్పిన్నర్, అండర్-19 క్రికెట్ నుంచి వెలుగులోకి వచ్చాడు. 2020 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ మెప్పించాడు. అతడిని ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకుంది. రవి టీ20, వన్డే రెండు జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు. దీపక్ హుడా చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, తొలిసారిగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ చాలాసార్లు ఒంటరిగా గెలిపించాడు. గతంలో కృనాల్ పాండ్యాతో గొడవ జరిగింది. దీంతో బరోడా జట్టు నుంచి తప్పించారు. రవి మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. స్పిన్ బౌలింగ్ చేయగలడు.