Virat Kohli: ప్రపంచ రికార్డ్ లిఖించిన విరాట్ కోహ్లీ.. అరుదైన జాబితాలో ఇద్దరే భారతీయులు.. అదేంటో తెలుసా?

|

Sep 13, 2023 | 8:06 PM

Virat Kohli Records: ప్రత్యేకమైన ఈ జాబితాలో కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే ఉన్నారు. వారిలో కింగ్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ జాబితాలో భాగమయ్యాడు. అయితే, మరో 8 మ్యాచ్‌లతో క్రికెట్ దేవుడి రికార్డును బ్రేక్ చేసేందుకు రన్ మెషీన్ సిద్ధమయ్యాడు. కాగా, ఇలాంటి రికార్డులో అంతర్జాతీయంగా కేవలం ఆరుగులు ప్లేయర్లు మాత్రమే చేరారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1 / 7
Virat Kohli Records: ఈ ఏడాది ఆసియాకప్‌ 2023లో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ మూడు విజయాలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.

2 / 7
అంటే శ్రీలంకపై విజయం విరాట్ కోహ్లీకి 300వ విజయం. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లలో విజయం రుచి చూసిన అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ కూడా చేరాడు.

3 / 7
విశేషమేమిటంటే ఈ జాబితాలో ఇద్దరు భారతీయులు మాత్రమే ఉన్నారు. వారిలో కింగ్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లలో విజయంలో భాగమయ్యాడు.

4 / 7
అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 664 మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 307 మ్యాచ్‌లు గెలిచాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు.

5 / 7
ఎందుకంటే విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 505 మ్యాచ్‌లు ఆడగా, భారత జట్టు 300 మ్యాచ్‌లు గెలిచింది. దీంతో 300 విజయాల్లో భాగమైన ప్రపంచ 6వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. టీమ్ ఇండియా మరో 8 సార్లు గెలిస్తే కింగ్ కోహ్లి పేరిట కొత్త రికార్డు చేరినట్లే.

6 / 7
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాంటింగ్ 560 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 377 గెలిచాడు.

7 / 7
అంతర్జాతీయ క్రికెట్‌లో 300+ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది. రికీ పాంటింగ్ (377), మహేల జయవర్ధనే (336), సచిన్ టెండూల్కర్ (307), జాక్వెస్ కలిస్ (305), కుమార సంగక్కర (305), విరాట్ కోహ్లీ ( 300).