
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో గిల్ 92 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ ప్రపంచ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. తొలి 35 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆమ్లా 1844 పరుగులు చేశాడు. ఇప్పుడు 35 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1900+ పరుగులు సాధించి శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో తొలి 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అంతే కాకుండా గిల్‌తో కలిసి శుభ్‌మన్ రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీని ద్వారా ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై శ్రేయాస్ అయ్యర్-శుభ్‌మన్ గిల్ 2వ వికెట్‌కు అత్యధిక పరుగులు చేసిన జోడీగా నిలిచారు.

ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కూడా శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్ ఇప్పటివరకు మొత్తం 7 సెంచరీలు చేశాడు.