Sarfaraz Khan: జీరో నుంచి సెంచరీ హీరోగా సర్ఫరాజ్.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో స్పెషల్ రికార్డ్..

|

Oct 19, 2024 | 1:01 PM

Sarfaraz Khan Record: ఇరానీ కప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 110 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

1 / 6
తొలి ఇన్నింగ్స్‌లో జీరో.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యేక రికార్డును లిఖించాడు. అది కూడా జీరో నుంచి సెంచరీ చేయడం విశేషం.

2 / 6
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ సున్నాకి అవుటయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌లో సున్నాతో సెంచరీ చేసిన ప్రత్యేక సాధకుల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు.

3 / 6
ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సున్నాతో పాటు సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డును గబ్బర్ ఫేమ్ శిఖర్ ధావన్ లిఖించాడు.

4 / 6
2014లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ జీరోకే ఔటయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేశాడు. ఇలా చేయడం ద్వారా కివీస్‌పై సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

5 / 6
ఇప్పుడు ఈ రికార్డు జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ కూడా చేరిపోయాడు. దీంతో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు.

6 / 6
అలాగే 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం 183 మంది ఆటగాళ్లు మాత్రమే సున్నాతో పాటు సెంచరీ చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ జీరో సెంచరీ రికార్డు జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు 183వ బ్యాట్స్‌మెన్.