Big News: ఆ ఫార్మాట్ నుంచి రిటైర్ కానున్న టీమిండియా ఆల్ రౌండర్.. త్వరలో ప్రకటించే అవకాశం..!

|

Dec 08, 2021 | 2:03 PM

Hardik Pandya: హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పటి నుంచి పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం హార్దిక్ టీమ్ ఇండియాకు కూడా దూరంగా ఉన్నాడు.

1 / 5
Hardik Pandya

Hardik Pandya

2 / 5
ఇన్‌సైడ్ స్పోర్ట్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, 'హార్దిక్ పాండ్యా తన గాయంతో పోరాడుతున్నాడని, అతను టెస్ట్‌ల నుంచి రిటైర్మెంట్‌ను పరిశీలిస్తున్నాడని బీసీసీఐ అధికారులు తెలియచేసినట్లు పేర్కొన్నారు. దీని గురించి అధికారికంగా బోర్డుకి తెలియజేయలేదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ హార్దిక్ పాండ్యా ఇంకా టీమ్ ఇండియా టెస్ట్ ప్లాన్‌లో భాగం కాలేదు. అయితే అతని రిటైర్మెంట్ టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. వీలైనంత త్వరగా అతని బ్యాకప్‌ను జట్టు కనుగొనవలసి ఉంటుంది.

3 / 5
హార్దిక్ పాండ్యా వన్డేలు, టీ20 క్రికెట్‌లో ఆడేందుకు టెస్టులకు వీడ్కోలు చెప్పవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2019 సంవత్సరంలో హార్దిక్ పాండ్యా వెన్ను గాయానికి గురయ్యాడని, ఆ తర్వాత అతను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అప్పటి నుంచి పాండ్యా మునుపటిలా బౌలింగ్ చేయలేకపోయాడు. దాని కారణంగా అతను భారాన్ని భరించవలసి వచ్చింది.

4 / 5
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా చాలా బాధపడ్డాడు. అతను మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. IPL 2021, టీ20 ప్రపంచ కప్‌లో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. గతేడాదిలో హార్దిక్ పాండ్యా వన్డే-టీ20లో మొత్తం 46 ఓవర్లు వేయగలిగాడు. అది కూడా అతని బౌలింగ్ అంత బలంగా కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడానికి ఇదే కారణం.

5 / 5
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌పై కసరత్తు చేస్తున్నాడు. నివేదికల ప్రకారం హార్దిక్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడడు. హార్దిక్ పాండ్యాకు చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో, టీమ్ ఇండియా టీ20, వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. హార్దిక్ ఫిట్‌గా లేకుంటే అతడితో పాటు టీమ్ ఇండియా కూడా నష్టపోయే పరిస్థితి.