T20 World Cup Records: పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే.. ట్రోఫీని గెలిపించడంలో మాత్రం విఫలం

|

Oct 17, 2021 | 9:44 PM

ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ 6 ఎడిషన్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ప్రత్యేక విషయం ఏమిటంటే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్ కాకపోవడం విశేషం.

1 / 7
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఒమన్, యూఏఈలో అక్టోబర్ 17 ఆదివారం నుంచి ప్రారంభమైంది. దీంతో వచ్చే ఒక నెల పాటు పరుగుల వర్షం కురవనుంది. చాలా సిక్సర్లు, ఫోర్లు కనిపిస్తాయి. వేగవంతమైన బ్యాటింగ్‌కు ఆ ఫార్మాట్ పేరుగాంచింది. ఈ ఫార్మాట్‌లో ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేశాడో అని తరచుగా వెతుకుతూనే ఉంటాం. అందుకే ఇప్పటివరకు ఆడిన ప్రతి టీ 20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల లిస్టు ఇక్కడ చూపించబోతున్నాం.

2 / 7
మొదటి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. కానీ, ఆ జట్టు స్టార్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ మాత్రం అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా లెజెండ్ 6 ఇన్నింగ్స్‌లలో అత్యధికంగా 265 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు చేశాడు. హేడెన్ సగటు 88.33, స్ట్రైక్ రేట్ 144.80గా ఉంది. అతని అత్యధిక స్కోరు 73 పరుగులు (నాటౌట్).

3 / 7
2009లో జరిగిన రెండో టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. టీం ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ టోర్నమెంట్ 7 ఇన్నింగ్స్‌లలో అత్యధికంగా 317 పరుగులు చేశాడు. సగటు 52.83, స్ట్రైక్ రేట్ 144.74గా ఉంది. అతను 96 పరుగులు (నాటౌట్) అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో మొత్తం 3 అర్ధ సెంచరీలు సాధించాడు.

4 / 7
2010 లో ఆడిన మూడో ప్రపంచకప్‌లో మరోసారి శ్రీలంక ఆటగాడు అత్యధిక పరుగులు చేశాడు. ఈసారి మహేల జయవర్ధనే ఈ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. అతను 6 ఇన్నింగ్స్‌లలో 60 సగటుతో అత్యధికంగా 159.78 స్ట్రైక్ రేటుతో 302 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

5 / 7
2012 లో నాల్గవ టీ 20 ప్రపంచ కప్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ బ్యాట్ తీవ్రంగా గర్జించింది. అతను 6 ఇన్నింగ్స్‌లు ఆడి, 49.80 సగటు, 150 స్ట్రైక్ రేట్‌తో 249 పరుగులు చేశాడు. అతని ఉత్తమ స్కోరు 72 పరుగులుగా నిలిచింది. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

6 / 7
2014 లో బంగ్లాదేశ్‌లో ఆడిన ప్రపంచకప్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. 6 ఇన్నింగ్స్‌లలో 316 పరుగులు చేశాడు. ఓ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుగా ఇది నమోదైంది. అతను 4 అర్ధ సెంచరీలు చేశాడు. జట్టును ఫైనల్‌కు నడిపించాడు. అక్కడ శ్రీలంక భారతదేశాన్ని ఓడించింది.

7 / 7
6వ ప్రపంచకప్ 2016 లో భారతదేశంలో నిర్వహించారు. ఈసారి బంగ్లాదేశ్ దిగ్గజం తమీమ్ ఇక్బాల్ అత్యధిక పరుగులు చేసిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. తమీమ్ 6 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 73.75 సగటు, 142 బలమైన స్ట్రైక్ రేట్‌తో 295 పరుగులు చేశాడు. టోర్నీలో తమీమ్ ఓ సెంచరీ(103), ఓ అర్థ సెంచరీ కూడా సాధించాడు.